Fri Dec 05 2025 14:57:36 GMT+0000 (Coordinated Universal Time)
నేడు భట్టి ఇంట్లో సీనియర్ల భేటీ
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈరోజు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో సమావేశమవుతున్నారు

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈరోజు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో సమావేశమవుతున్నారు. సీనియర్ నేతలు ఈ భేటీకి హాజరవుతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీలు నియమించిన సంగతి తెలిసిందే. దీనిపై అనేక మంది సీనియర్ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
అసంతృప్త నేతలు...
కొందరు ఏకంగా తమకు ఇచ్చిన పదవులకు రాజీనామాలు చేశారు. సీనియర్లను కాదని జూనియర్లకు రాజకీయ వ్యవహారాల కమిటీలో చోటు కల్పించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లి అధినాయకత్వంతో చర్చించాలని నిర్ణయించారు. ఈ భేటీలో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. కమిటీల్లో సీనియర్లకు స్థానం కల్పించాలని హైకమాండ్ ను కోరనున్నారు.
Next Story

