Sat Dec 13 2025 19:30:50 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : జీవన్ రెడ్డి నేరుగా సీఎం ను టార్గెట్ చేయడం వెనుక అందుకేనా?
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. ఇక వేచి చూసి లాభం లేదని భావించిన పెద్దాయన వాయిస్ పెంచినట్లు కనపడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ వారికి కాకుండా ఫిరాయింపుదారులకు మద్దతు ఇస్తున్నారంటూ జీవన్ రెడ్డి మండి పడ్డారు. తమకు పోటీ పక్క వాళ్లతో కాదని, ముఖ్యమంత్రి స్థాయి వారితో తమ పోటీ అని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్లతో కాని అభివృద్ధి పక్క పార్టీ నుంచి వచ్చి చేస్తాడట అంటూ జగిత్యాల ఎమ్మెల్యే పై కూడా సంజీవ్ కుమార్ పై కూడా మండి పడ్డారు. అయితే తాను వీరితో పోటీ పడటం లేదని, తాను అడుగుతుంది ముఖ్యమంత్రిని మాత్రమేనని అన్నారు.
సీనియర్ నేతగా ఉన్నా...
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న జీవన్ రెడ్డిని పార్టీ గుర్తించలేదు. జీవన్ రెడ్డికి ఎలాంటి పదవులు లభించలేదు. దీర్ఘకాలంగా, పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా కాంగ్రెస్ జెండాను వదలకుండా పోరాడిన జీవన్ రెడ్డిని పక్కన పెట్టడంపై ఆయన వర్గం సీరియస్ గా ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఆయన కాంగ్రెస్ లో కీలక నేతగా కొనసాగుతున్నారు. దాదాపు నలభై ఏళ్ల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. తొలుత టీడీపీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమయినా తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన కొనసాగుతున్నారు. జగిత్యాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన సంజీవ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న నాటి నుంచి జీవన్ రెడ్డి లో అసహనం పెరిగింది. అసంతృప్తి బయటకు కక్కుతున్నా.
రెండేళ్లు కావస్తున్నా...
ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటయి రెండేళ్లు కావస్తుండటం, తనకు ఎలాంటి పదవి ఇచ్చేందుకు రాష్ట్ర నాయకత్వం సుముఖంగా లేకపోవడం, హస్తిన నాయకత్వం కూడా పట్టించుకోకపోవడంతో పెద్దాయనలో ఫ్రస్టేషన్ పీక్స్ కు చేరుకుంది. అందుకే తరచూ జగిత్యాలకు వచ్చిన మంత్రుల ఎదుట కూడా ఆయన బరస్ట్ అవుతున్నారు. జీవన్ రెడ్డిని పదవి ఇస్తే జగిత్యాలలో మళ్లీ రెండు వర్గాలు ఏర్పడతాయని నాయకత్వం వెనుకంజ వేస్తున్నట్లు కనిపిస్తుంది. దీంతో జీవన్ రెడ్డి ఇక తాడో పేడో తేల్చుకోవడానికే సిద్ధమయినట్లు కనిపిస్తుంది. అందుకే నేరుగా ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం చూస్తుంటే త్వరలోనే ఆయన ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.
Next Story

