Wed Mar 18 2026 04:05:06 GMT+0530 (India Standard Time)
కాంగ్రెస్లో మరో సంక్షోభం.. వారంతా రాజీనామా
తెలంగాణ కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలు పదవులకు రాజీనామా చేశారు

తెలంగాణ కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలు పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు మాణికం ఠాగూర్ కు లేఖ రాశారు. తమకు ఇటీవల కేటాయించిన పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు వారు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్లో మరో సంక్షోభం ఏర్పడింది.
13 మంది నేతలు...
మొత్తం పదమూడు మంది నేతలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఇందులో వేం నరేందర్ రెడ్డి, సీతక్క, ఎర్రశేఖర్, విజయరమణారావు వంటి నేతలున్నారు. మరోవైపు పీసీసీ సమావేశానికి సీనియర్ నేతలు ఎవరూ రాలేదు. దూరంగా ఉండటంతో కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది.
Next Story

