Thu Mar 19 2026 13:09:17 GMT+0530 (India Standard Time)
రేవంత్ హౌస్ అరెస్ట్
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మొహరించారు.

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మొహరించారు. రేవంత్ రెడ్డి ఇంటి వద్ద బ్యారికేడ్లు నిర్మించి ఆయనను బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. నేడు విద్యుత్తు ఛార్జీల పెంపుదలకు నిరసనగా విద్యుత్ సౌధ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ నేతలు కూడా....
ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందని భావించి హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story

