Fri Dec 05 2025 15:56:10 GMT+0000 (Coordinated Universal Time)
Telangana CM: ఢిల్లీకి తెలంగాణ సీఎం.. కారణాలు అవేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. సెప్టెంబర్ 16వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అదే రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా వెళ్లే అవకాశం కూడా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పు తదితర అంశాలపై పార్టీ అధిష్టానంతో చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
గత కొన్ని నెలలుగా ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్లొస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ప్రాధాన్యంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలుస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో రహదారుల విస్తరణ, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన అంశాలపై కూడా చర్చిస్తూ వస్తున్నారు. ఈసారి పర్యటనలో ఎవరెవరిని కలుస్తారో తెలియాలి.
Next Story

