Thu Mar 26 2026 02:41:23 GMT+0530 (India Standard Time)
Kcr : నేడు ఢిల్లీకి కేసీఆర్
సీఎం కేసీఆర్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా రాష్ట్రపతి ఎన్నికలపై ఆయన వివిధ పక్షాల నేతలతో సమావేశం కానున్నారని తెలిసింది. ఇటీవల ముంబయి వెళ్లి ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లను కలసి జాతీయ రాజకీయాలపై చర్చించి వచ్చారు.
రాష్ట్ర పతి ఎన్నికల....
దీనికి కొనసాగింపుగా కేసీఆర్ ఢిల్లీ యాత్ర సాగనుంది. ఢిల్లీలో ఆయన పలువరు ప్రాంతీయ పార్టీల అధినేతలతో సమావేశం అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా అందరికి అనుకూలమైన రాష్ట్ర పతి అభ్యర్థిని నిలబెట్టాలన్న లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ ఆలోచనలకు శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే కూడా ఓకే చెప్పారని తెలిసింది. దీంతో కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story

