Thu Mar 26 2026 15:36:23 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ జిల్లాల పర్యటన వాయిదా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన వాయిదా పడింది. ఈ నెల 23 నుంచి ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన చేస్తారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన వాయిదా పడింది. ఈ నెల 23 నుంచి ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన చేస్తారు. వాస్తవానికి రేపటి నుంచి కేసీఆర్ జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.
ఈ నెల 23న.....
ఈ నెల 23న ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి జిల్లాలో పర్యటిస్తారు. అక్కడ నిర్మాణం చేసిన నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. వీటితో పాటు కొత్తగా నిర్మించిన మార్కెట్ యార్డును, డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించనున్నారు. దీంతో పాటు వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల, కర్నెతండా ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ శంకుస్థాపన చేస్తాయరు. అనంతరం బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు.
- Tags
- kcr
- disticts tour
Next Story

