Sun Mar 15 2026 18:57:04 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ ప్రకటన ఇదే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. ఆయన ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. ఆయన ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దాదాపు లక్ష ఉద్యోగాల ప్రక్రియకు సంబంధించి ఆయన ప్రకటన ఉండనుంది. ఈ ప్రకటనలో ప్రధానంగా కాంటాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించే అంశం ఉండనుంది. అలాగే డీఎస్సీ ని పునరుద్ధరిస్తామని కేసీఆర్ ప్రకటన చేయనున్నారు.
లక్ష ఉద్యోగాలు....
స్థానికులకే వంద శాతం కల్పించేలా ఈ ప్రకటన ఉండనుంది. తొలిసారి గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లపై కూడా ప్రకటన ఉండే అవకాశముంది. ప్రధానంగా పోలీసు, వైద్య, విద్య రంగాల్లో ఖాళీలను భర్తీ చేసే విషయంపై స్పష్టత కేసీఆర్ ప్రకటన ద్వారా రానుంది. తక్షణ నియామకాలు చేపట్టేలా ఆయన ప్రకటిస్తారని చెబుతున్నారు. మొత్తం లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించనున్నారు.
- Tags
- kcr
- employment
Next Story

