Sun Mar 08 2026 00:50:14 GMT+0530 (India Standard Time)
సచివాలయానికి కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కాసేపట్లో సచివాలయానికి రానున్నారు. ఆయన సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కాసేపట్లో సచివాలయానికి రానున్నారు. ఆయన సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. సచివాలయం నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతోనూ, కాంట్రాక్టర్లతోనూ ఆయన చర్చిస్తారు. సచివాలయానికి కేసీఆర్ వస్తుండటంతో ఆ ప్రాంతంలో భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.
కొత్త భవనాల నిర్మాణం...
తెలంగాణలో ఐదు వందల కోట్లతో సచివాలయం నిర్మాణం చేపడుతున్న సంగతి తెలిసిందే. పాత భవనం కూల్చి వేసి కొత్త నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పనుల పురోగతిని పరిశీలించేందుకు కేసీఆర్ సచివాలయానికి రానున్నారు.
- Tags
- kcr
- secratariat
Next Story

