Wed Mar 25 2026 23:32:28 GMT+0530 (India Standard Time)
నేడు వనపర్తి జిల్లాకు కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు వనపర్తి జిల్లాకు రానున్నారు. ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు వనపర్తి జిల్లాకు రానున్నారు. ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వనపర్తి జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడి నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు.
పలు అభివృద్ధి....
ఇప్పటికే ప్రభుత్వం మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం 7,289 కోట్ల రూపాయలను కేటాయించారు. మొదటి దశ కింద 9,123 పాఠశాలలను ఎంపిక చేశారు. వనపర్తిలో ఈ కార్యక్రమంతో పాటు మరికొన్ని ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు.
Next Story

