Sun May 28 2023 10:42:12 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ డుమ్మా
మే 27న నీతి ఆయోగ్ ఎనిమిదో పాలక మండలి సమావేశం జరగనుంది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు.

27న న్యూఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవ్వడం లేదు. నీతి ఆయోగ్ సమావేశాలు పనికిమాలినవని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆరోపణలు చేశారు. ఆ అభిప్రాయంతోనే ఉన్న ఆయన తాజా సమావేశాలకు కూడా హాజరవ్వడం లేదు. ఈసారి మంత్రులు, అధికారులను కూడా పంపించే అవకాశం లేదని అంటున్నారు. తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నప్పుడు ఈ సమావేశానికి హాజరయ్యే ప్రసక్తే లేదని కేసీఆర్ గురువారం ఓ సమావేశంలో చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.
మే 27న నీతి ఆయోగ్ ఎనిమిదో పాలక మండలి సమావేశం జరగనుంది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఇందులో ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అనేక అంశాలపై చర్చించనున్నారు. కేసీఆర్ చివరిసారిగా 2018లో జరిగిన ఒక సమావేశానికి హాజరయ్యారు. ఇక గత కొన్నేళ్లుగా నీతి ఆయోగ్ సమావేశాలకు హాజరుకావడం మానేశారు.
ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో ఆ సమావేశంలో చర్చించనున్న అంశాలపై ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Next Story