Mon Feb 02 2026 11:03:39 GMT+0000 (Coordinated Universal Time)
మొగిలియ్య కు కోటి ఆర్థిక సాయం
పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు కేసీఆర కోటి రూపాయల ఆర్థికసాయాన్ని ప్రకటించారు.

పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు కేసీఆర కోటి రూపాయల ఆర్థికసాయాన్ని ప్రకటించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కిన్నెర మెట్ల కళాకారుడు మొగిలయ్య ప్రగతి భవన్ కు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. పద్మశ్రీ అవార్డు రావడం పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మొగిలయ్యను శాలువతో సత్కరించారు.
ఇంటి నిర్మాణానికి....
ఈ సందర్భంగా మొగిలయ్యకు కోటి అవార్డు ప్రకటించారు. మొగిలయ్య ఇంటి నిర్మాణంతో పాటు ఇతర ఖర్చుల కింద వీటిని వినియోగించుకోవచ్చని సూచించారు. ఇంటి స్థలంతో పాటు దాని ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చుకు కూడా ఇది ఉపయోగపడుతుందని కేసీఆర్ సూచించారు. మొగిలయ్యకు ప్రభుత్వం నెలనెల గౌరవ వేతనం కూడా ఇస్తుందని కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా మొగిలయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story

