Wed Mar 18 2026 22:48:21 GMT+0530 (India Standard Time)
నేడు టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల
తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి

తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈరోజు మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. గత నెల ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకూ టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. పదో తరగతి పరీక్షల్లో ఫెయిలయిన వారి కోసం ఈ పరీక్షలను నిర్వహించారు.
ఉత్తీర్ణత సాధించిన వారు...
ఈ ఫలితాలను అనుకున్న సమయాని కంటే ముందుగానే విడుదల చేస్తున్నారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారు రెగ్యులర్ గా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చేరే వీలుంది. ఫలితాలు మంత్రి విడుదల చేసిన వెంటనే www.bse.telangana. gov. in వెబ్ సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.
Next Story

