Fri Dec 05 2025 13:35:30 GMT+0000 (Coordinated Universal Time)
కోమటిరెడ్డి ఇంటికి రేవంత్
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొద్ది సేపటి క్రితం పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వచ్చారు

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొద్ది సేపటి క్రితం పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వచ్చారు. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక అనేక మంది సీనియర్ నేతలను స్వయంగా ఇంటికి వెళ్లి కలిసి సహకరించాలని కోరారు. అయితే అప్పట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు పీసీసీ చీఫ్ పదవి దక్కలేదన్న ఆగ్రహంతో ఉండటంతో రేవంత్ ఆయన ఇంటికి వెళ్లలేదు.
తనకు సహకరించాలని...
ఇటీవల జరిగిన కాంగ్రెస్ సమావేశానికి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కాలేదు. పైగా భువనగిరిలో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ ను పొడగడం ఒకింత పార్టీకి ఇబ్బందికరంగా మారింది. కాంగ్రెస్ కు నమ్మకమైన నేతగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులు కొనసాగుతున్నారు. వారి ప్రభావం రెండు మూడు జిల్లాల్లో ఉంటుంది. దీంతో రేవంత్ రెడ్డి ఆయనతో భేటీ అయి తనకు సహకరించాల్సిందిగా కోరనున్నారు. తన ఇంట్లోకి రేవంత్ ను కోమటిరెడ్డి సాదరంగా ఆహ్వానించారు.
Next Story

