Sun Mar 15 2026 23:26:41 GMT+0530 (India Standard Time)
Telangana : నేడు వరంగల్ కు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వరంగల్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వరంగల్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రధానంగా కాళోజీ భవన్ ను రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీని తర్వాత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు.
ఇందిరా శక్తి పేరుతో....
అనంతరం వరంగల్ లో జరిగే భారీ బహిరంగసభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా ప్రభుత్వం విజయోత్సవాలను నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈ నెల 19 నుంచి డిసెంబరు 9 వతేదీ వరకూ మూడు భారీ సభలను నిర్వహించాలని పార్టీ, ప్రభుత్వం నిర్ణయించాయి. అందులో భాంగంగా ఈరోజు వరంగల్ లో ఇందిరాశక్తి పేరుగో మహిళల సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

