Tue Mar 24 2026 06:21:57 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు రేవంత్ ఢిల్లీ పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈరోజు రాత్రికి ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నట్లు తెలిసింది. మంత్రి వర్గ విస్తరణపై పార్టీ పెద్దలతో చర్చించేందుకు ప్రధానంగా ఆయన ఢిల్లీ వెళుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్నా మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండటంతో పాటు అనేక జిల్లాల్లో మంత్రులు లేరు. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తులు పూర్తి చేసినట్లు తెలిసింది.
మంత్రి వర్గ విస్తరణ గురించి...
అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ లోని కాంగ్రెస్ పెద్దలను మరోసారి కలసి మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించి వచ్చేందుకే ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరునంలో మంత్రి వర్గ విస్తరణ అవసరమని రేవంత్ రెడ్డి ఢిల్లీలోని హైకమాండ్ కు చెప్పనున్నారు. ఇప్పటికే జాబితాను రూపొందించినప్పటికీ దానికి ఆమోదముద్ర లభించేలా ఈ పర్యలన కొనసాగుతుందని తెలిసింది. మరోవైపు నేటి నుంచి శాఖల వారీగా రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్షలు చేయనున్నారు.
Next Story

