Wed Jan 28 2026 18:19:05 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : నేడు రేవంత్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేడు కూడా కొనసాగుతుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేడు కూడా కొనసాగుతుంది. నేడు బీసీ కులగణనపై పార్లమెంటు సభ్యులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. బీసీ కులగణన చేసిన తీరును వారికి వివరించనున్నారు. ఏ ప్రాతిపదికన కులగణన చేశామో పార్లమెంటు సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించనున్నారు. త్వరలో దేశ వ్యాప్తంగా కులగణన జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో సర్వే సేకరణ తీరును గురించి వివరించనున్నారు.
విపక్ష నేతలను కలసి...
దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యే అవకాశముంది. బీసీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించేలా వత్తిడి తేవడంపై విపక్ష నేతలను కూడా కలసి ఆయన మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయనున్నారు. అంతేకాకుండా కేంద్ర మంత్రులను కూడా కలసి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులను గురించి చర్చించనున్నారు.
Next Story

