Sat Jan 31 2026 18:34:04 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : రేవంత్ అమెరికా పర్యటన ఖరారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఖరరాయింది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఖరరాయింది. ఆగస్టు మూడో తేదీన ఆయన అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నారు. వారం రోజుల పాటు రేవంత్ రెడ్డి అమెరికాలోనే పర్యటిస్తారు. డల్లాస్ తో పాటు పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
పెట్టుబడుల కోసం...
రాష్ట్రంలో పెట్టుబడుల ఆకట్టుకునే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రత్యేకించి అమెరికాలో పర్యటించనున్నారు. వివిధ కంపెనీల సీఈవోలను ఆయన ఈ సందర్భంగా కలసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు. వారం రోజుల పాటు పర్యటించనున్న రేవంత్ తిరిగి ఆగస్టు 11న హైదరాబాద్ కు చేరుకుంటారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి వెంట ఒకరిద్దరు మంత్రులతో పాటు ఉన్నతాధికారులు కూడా వెళ్లనున్నారు.
Next Story

