Sun Oct 13 2024 12:44:12 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. గాంధీ జయంతి సందర్భంగా రేవంత్ బాపూ ఘాట్ కు వెళ్లి నివాళుర్పిస్తారు. ఉదయం పదిన్నర గంటలకు ఆయన బాపూ ఘాట్ కు చేరుకుంటారని సమాచార శాఖ తెలిపింది. తర్వాత సాయంత్రం 5.30 గంటలకు దుండిగల్ బయలుదేరి వెళతారు.
దుండిగల్ లో ఉన్న...
దుండిగల్ లో ఉన్న శ్రీ సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమంలో ఉన్న శ్రీ గణపతి దత్త మండపాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం సభలో ప్రసంగించనున్నారు. నిన్నంతా ఢిల్లీలో బిజీగా గడిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో సమావేశమై రాజకీయ అంశాలపై చర్చించి రావడంతో ఆయన ఏ నిర్ణయం ప్రకటిస్తారోనన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది.
Next Story