Tue Mar 24 2026 02:42:37 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేటి రేవంత్ రెడ్డి సమీక్షలు ఇవే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. పలు సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. వివిధ శాఖలను సమీక్ష చేయనున్నారు. వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఉదయం 10:45 గంటలకు జేఆర్సీ కన్వెన్షన్‌కు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. అక్కడ జరిగే వి హబ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
వివిధ శాఖలపై సమీక్షలు...
మధ్యాహ్నం యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీపై సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించనున్నారు. మధ్యాహ్నం .1:30 గంటలకు మైనింగ్ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఇసుక పంపిణీ విధానంపై అధికారులతో చర్చించనున్న రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 3:30 గంటలకు ఇరిగేషన్ విభాగంపై సమీక్ష చేయనున్నారు.
Next Story

