Fri Dec 05 2025 17:40:35 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : ఈ నెల 15న రేవంత్ విదేశీ పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఖరరాయింది. ఈ నెల 15వ తేదీన ఆయన విదేశాలకు వెళ్లనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఖరరాయింది. ఈ నెల 15వ తేదీన ఆయన విదేశాలకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 15వ తేదీన దావోస్ కు వెళ్లనున్నారు. అక్కడ జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ కు రేవంత్ రెడ్డి హాజరు కానున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
దావోస్ కు వెళ్లి...
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో పాల్గొని పెట్టుబడులకు సంబంధించి రేవంత్ రెడ్డి వివిధ సంస్థలకు ఆహ్వానం పలుకుతారు. పెట్టుబడులకు తమ రాష్ట్రంలో ఇచ్చే రాయితీలను కూడా ప్రస్తావించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి మూడు రోజుల పాటు లండన్ బయలుదేరి వెళతారు. యూకేలో జరిగే సదస్సులో రేవంత్ర ెడ్డి పాల్గొంటారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళుతున్నారు.
Next Story

