Fri Mar 20 2026 10:11:09 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు వరంగల్ కు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి తన పర్యటన ముగించుకుని వరంగల్ కు చేరుకుంటారు. ఈరోజు వరంగల్ లో మేఘా టెక్స్టైల్స్ పార్క్, గ్రేటర్ వరంగల్ పై రివ్యూ చేయనున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి రేవంత్ తెలుసుకోనున్నారు.
వరాలు ప్రకటిస్తారని...
నిజానికి నిన్ననే రేవంత్ రెడ్డి వరంగల్ లో పర్యటించాల్సి ఉంది. అయితే ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండటంతో ఆయన పర్యటన రద్దయింది. నేడు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ జిల్లాకు వరాలు ప్రకటిస్తారని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ వస్తుండటంతో పార్టీ నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story

