Wed Mar 18 2026 20:01:59 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు రేవంత్ రెడ్డి టూర్ ఎక్కడెక్కడ అంటే?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రెండు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రెండు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. తొలుత సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఆయన పర్యటన ఉండనుంది. ఈరోజు సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం అభ్యర్థిగా దానం నాగేందర్ నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్ పాల్గొని కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.
బహిరంగ సభలో...
దానం నాగేందర్ తన నామినేషన్ కార్యక్రమానికి ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొంారు. ఈరోజు సాయంత్రం వరంగల్ లో జరిగే బహిరంగ సభకు రేవంత్ రెడ్డి హాజరవుతారు. తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను సాధించే లక్ష్యంతో రేవంత్ రెడ్డి గత కొద్దిరోజులుగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
Next Story

