Thu Mar 19 2026 06:05:18 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు రేవంత్ మూడు జిల్లాల్లో పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మూడు లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మూడు లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. నేడు రేవంత్ రెడ్డి కరీంనగర్, వరంగల్, చేవెళ్ల నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఎన్నికల ప్రచారంలో...
ఈ మూడు చోట్ల బహిరంగ సభలతో పాటు రోడ్ షోలలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ ఎన్నికల్లో పథ్నాలుగు నియోజకవర్గాల్లో గెలుపు లక్ష్యంగా రేవంత్ రెడ్డి పర్యటనలు సాగనున్నాయి. పార్లమెంటు ఎన్నికల తర్వాత తాము ఇచ్చిన హామీలను, గ్యారంటీలను అమలు చేస్తామంటూ ఆయన జనంలోకి వెళుతున్నారు.
Next Story

