Sun Mar 08 2026 14:08:53 GMT+0530 (India Standard Time)
Revnath Reddy : నేడు రేవంత్ రోడ్ షోలు.. కార్నర్ మీటింగ్లు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లలో రేవంత్ రెడ్డి పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా రేవంత్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఇబ్రహీంపట్నంలో జరిగే రోడ్ షో లో పాల్గొంటారు.
అభ్యర్థులకు మద్దతుగా...
అనంతరం కార్నర్ మీటింగ్ లో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు తర్వాత రాత్రి 7.30 గంటలకు ఉప్పల్ లో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం జరిగే సభలో ప్రసంగిస్తారు. రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగే సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

