Sun Mar 15 2026 06:12:32 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు ఎమ్మెల్యే ఇంటికి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు. ఆయనతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో అభ్యర్థి విజయం సాధించడంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. భువనగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందేలా వ్యూహరచన చేయనున్నారు.
వ్యూహరచన కోసం...
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసంలో భువనగిరి పార్లమెంట్ ముఖ్య నేతలందరూ మరికొద్దిసేపట్లో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సెగ్మెంట్ల ముఖ్యులు తదితరులు హాజరు కానున్నారు. విజయం సాధించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.
Next Story

