Sun Mar 15 2026 10:42:57 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు కేసీఆర్ సొంత జిల్లాకు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా నేడు నీలం మధు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. నీలం మధు నామినేషన్ వేసే ముందు జరిగే ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు.
నామినేషన్ ర్యాలీలో...
ఉదయం పదకొండు గంటలకు మెదక్ కు చేరుకుని రాందాస్ చౌరస్తాలో జరిగే కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. మాజీ ముఖ్యమంత్రి సొంతజిల్లాలో కాంగ్రెస్ ను గెలిపించే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈనేపథ్యంలోనే ఆయన నామినేషన్ కార్యక్రమానికి స్వయంగా వెళుతున్నారు. పార్టీ నేతలు, క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు.
Next Story

