Fri Dec 05 2025 22:44:44 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : నేడు మహబూబాబాద్ కు సీఎం రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. లోక్సభ నియోజకవర్గం అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ కు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. సాయంత్రం జరిగే జనజాతర సభలో ఆయన పాల్గొంటారు. తొలిసారి మహబూబాబాద్ కు రేవంత్ రెడ్డి వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లి అక్కడ వంశీచందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలోనూ రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
జనజాతర సభకు...
జనజాతర సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి కార్యకర్తలను తరలిస్తున్నారు. మహబూబాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ సభ జరగనుంది. నేటి నుంచి వరసగా రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించే దిశగా ఆయన పర్యటనలు సాగనున్నాయి. ముఖ్యమంత్రి అన్ని జిల్లాల్లోనూ పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

