Fri Dec 05 2025 14:34:24 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : నేడు నాలుగు నియోజకవర్గాల్లో రేవంత్ పర్యటన
ఈరోజు నాలుగు నియోజకవర్గాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు

ఈరోజు నాలుగు నియోజకవర్గాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలలో ఆయన పాల్గొననున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం దగ్గరపడుతున్న సమయంలో ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. అత్యధిక స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో వరస పర్యటనలు చేస్తూ క్యాడర్ లలో ఉత్సాహం నింపుతూ ప్రజలను తమ వైపునకు తిప్పుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.
వరస పర్యటనలతో...
ఈరోజు కొత్తగూడెం, మహబూబ్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో జరిగే రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లలో రేవంత్ రెడ్డి పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మీటింగ్ లకు భారీ ఎత్తున జనాన్ని సమీకరించేందుకు పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. పార్టీ కనీసం 14 పార్లమెంటు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా రేవంత్ రెడ్డి తన పర్యటనలను కొనసాగిస్తున్నారు.
Next Story

