Sun Oct 13 2024 12:53:27 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలుస్తారు. ఆయన ఇటీవల ఒక బహిరంగ సభలో అస్వస్థతకు గురికావడంతో ఆయనను పరామర్శించనున్నారు రేవంత్ రెడ్డి. అనంతరం పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు.
రాజకీయ పరిణామాలపై...
రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి తదితర అంశాలపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారని తెలిసింది. దీంతో పాటు హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వం జరుగుతున్న విమర్శలను కూడా ఆయన వివరించనున్నారు. అనంతరం రాత్రికి హైదరాబాద్ కు బయలుదేరి రావాల్సి ఉంది.
Next Story