Wed Mar 18 2026 09:01:00 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అనంతరం కంటోన్మెంట్ శాసనసభ ఉపఎన్నికల ప్రచారంలోనూ రేవంత్ పాల్గొంటారు. ఈరోజు ఉదయం గాంధీ భవన్ లో బీజేపీ పై ఛార్జిషీట్ విడుదల చేసేకార్యక్రమంలోనూ ఆయన పాల్గొననున్నారు. సాయంత్రం రాజేంద్రనగర్ లో జరిగే రోడ్ షోలో రేవంత్ పాల్గొని కార్నర్ మీటింగ్ లో ప్రసంగించనున్నారు.
కంటోన్మెంట్ లోనూ...
అనంతరం రాత్రి 7.30 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు చేరుకుని అక్కడ జరిగే రోడ్ షోలు పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కనీసం పథ్నాలుగు స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో వరసగా రేవంత్ రెడ్డి నియోజకవర్గాల వారీగా పర్యటిస్తున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభల ద్వారా తాము ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు.
Next Story

