Wed Mar 18 2026 05:47:10 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు రేవంత్ ప్రచారం ఇలా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆర్మూర్, నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆర్మూర్, నిజాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారానికి ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
రోడ్ షోలుతో....
ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఆర్మూర్ లో జరిగే రోడ్ షోలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం కార్నర్ మీటింగ్ లో ఆయన ప్రసంగించనున్నారు. తర్వాత రాత్రి ఏడు గంటలకు నిజామాబాద్ లో రోడ్ షో తో పాటు కార్నర్ మీటింగ్ లో పాల్గొని పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story

