Tue Mar 24 2026 13:43:25 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు కూడా ఢిల్లీలోనే రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వచ్చే అవకాశముంది. వరసగా పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి సమావేశాలవుతున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రి వర్గ విస్తరణపై ఆయన పార్టీ పెద్దలతో చర్చిస్తున్నారు. నామినేటెడ్ పోస్టులను త్వరగా భర్తీ చేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.
మంత్రి వర్గ విస్తరణపై...
దీంతో ఢిల్లీ చేరుకున్న ఆయన పార్టీలో కీలక నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చే విషయంపై చర్చలు జరుపుతున్నారు. మంత్రి వర్గ విస్తరణ కూడా త్వరలో ఉండటంతో ఒకేసారి ఆరు మంత్రి పదవులు భర్తీ చేయాలా? లేక కొన్నింటిని పెండింగ్ లో ఉంచి కొన్నింటిలోనే మంత్రులను నియమించాలా? అన్న దానిపై ఇంకా చర్చలు జరుపుతున్నారు.
Next Story

