Sat Mar 07 2026 23:01:01 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు ఢిల్లీలో రేవంత్.. షెడ్యూల్ ఇదే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవనున్నారు. నిన్న సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి నేడు కేంద్ర మంత్రులతో పాటు పార్టీ పెద్దలను కూడా కలవనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రేవంత్ ఢిల్లీకి వెళ్లినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈరోజు రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు
కేంద్ర మంత్రులను...
ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్, విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కేసింగ్ ను కలిసే అవకాశముంది. దీంతో పాటు పార్టీ పెద్దలను కలసి ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంపై చర్చించనున్నారు. తెలంగాణలో నాలుగు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయిన నేపథ్యంలో దానిపై హైకమాండ్ నుంచి క్లారిటీ తీసుకునే అవకాశముంది.
Next Story

