Sat Mar 07 2026 19:36:53 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు రాజ్‌భవన్ కు రేవంత్ రెడ్డి
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ తో భేటీ కానున్నారు. ఉదయం పది గంటలకు రాజ్‌భవన్ కు వెళ్లనున్నారు

నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ తో భేటీ కానున్నారు. ఉదయం పది గంటలకు రాజ్‌భవన్ కు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. రేపు జరగనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు గవర్నర్ ను ఆహ్వానించనున్నారు. జూన్ 2వ తేదీన తెలంగాణ దశాబ్ది వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఆవిర్భావ వేడుకలకు...
ఈ వేడుకలకు ముఖ్యఅతిధిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా హాజరు కానున్నారు. సోనియా గాంధీ చేతుల మీదుగా రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఆవిర్భావ వేడుకలకు ప్రభుత్వం అందరినీ ఆహ్వానిస్తుంది. ప్రతిపక్ష నేత కేసీఆర్ కు కూడా కాంగ్రెస్ ముఖ్య నేతలు వెళ్లి ఆహ్వానించి వచ్చారు. ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నర్ ను కలవనున్నారు.
Next Story

