Thu Dec 18 2025 17:33:00 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : ఎంఐఎం ఎమ్మెల్యేలతో రేవంత్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. పాతబస్తీలో అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సమీక్షించనున్నారు. అలాగే మూసీ అభివృద్ధి పనులపై కూడా ఎంఐఎం ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత తొలిసారి గ్రేటర్ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గ్రేటర్ హైదరాబాద్ లో...
గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకే అన్ని స్థానాలు లభించాయి. దీంతో తొలుత ఎంఐఎం ఎమ్మెల్యేలతో సమావేశం కావడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల సమయంలో ఎంఐఎం నేతలతో వాదనలకు దిగిన రేవంత్ అదే పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై అభివృద్ధి పనులపై చర్చించడం రాజకీయంగా చర్చకు తావిస్తుంది.
Next Story

