Wed Mar 25 2026 13:44:16 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు ఇండోర్ కు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఇండోర్ బయలుదేరి వెళ్లనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఇండోర్ బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ జరిగే సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా బయలుదేరి వెళుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి అందరు నేతలు హాజరవుతున్నారు.
రాజ్యాంగంపై దాడిని నిరసిస్తూ...
ఈరోజు మధ్యప్రదేశ్లోని ఇండోర్ లో కాంగ్రెస్ ర్యాలీని నిర్వహించనుంది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరిట ఈ ర్యాలీ నిర్వహిస్తుంది. అంబేద్కర్ జన్మస్థలం మౌ పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తుండటంతో రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అక్కడకు బయలుదేరి వెళుతును్నారు. రాజ్యాంగంపై దాడి చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ర్యాలీని చేస్తుంది.
Next Story

