Sat Mar 21 2026 21:37:20 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు కేంద్రమంత్రులను కలుస్తారు. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సమావేశమై ఎరువుల కొరతపై చర్చించనున్నారు. రాష్ట్రాలనికి రావాల్సిన ఎరువల కోటాను విడుదల చేయాలని కోరనున్నారు. ఇక మెట్రో రెండో దశ విస్తరణ పనులపై కూడా కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశముంది.
కేంద్ర మంత్రులతో పాటు...
దీంతో పాటు పలు ప్రాజెక్టులతో పాటు వివిధ రకాల అనుమతుల కోసం కేంద్ర మంత్రులను కలవనున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. ఈ నెల 14న సూర్యాపేట తుంగతుర్తితో జరగనున్న బహిరంగ సభకు హాజరు కావాలని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలను ఆహ్వానించనున్నారు. కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడానికి ప్రభుత్వం ఈ నెల 14న భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరనున్నారు.
Next Story

