Tue Mar 24 2026 09:10:10 GMT+0530 (India Standard Time)
Telangana : నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. పార్టీ పెద్దలతో ఆయన సమావేశం కానున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. పార్టీ పెద్దలతో ఆయన సమావేశం కానున్నారు. శ్రావణమాసం ముగియనుండటంతో నామినేటెడ్ పదవుల భర్తీపై ఆయన చర్చించనున్నారు. ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేసినా మరికొన్ని ముఖ్యమైన నామినేటెడ్ పదవులు ఉండటంతో ఆయన పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు.
పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై...
దీంతోపాటు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో చర్చించే అవకాశముంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ పదవిని భర్తీ చేయడంతో ఆలస్యం కావడంతో త్వరగా పూర్తి చేయాలని కోరనున్నారు. ఇక రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు హైదరాబాద్ రావాల్సిందిగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఆహ్వానించనున్నారు.
Next Story

