Sun Dec 07 2025 23:38:26 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఇండి కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులతో పాటు ఇండి కూటమి నేతలందరూ ఈ కార్యక్రమానికి హాజరు కానుండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళుతున్నారు.
నామినేషన్ కార్యక్రమంలో...
జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో ఆయనను అభినందించి వచ్చేందుకు, నామినేషన్ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని తన మద్దతు తెలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. నామినేషన్ కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకుంటారు.
Next Story

