Tue Mar 24 2026 01:46:55 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం కర్ణాటక నుంచి బయలుదేరి ఆయన ఢిల్లీకి వెళతారు. ప్రస్తుతం బెళగావిలో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన రేవంత్ రెడ్డి అటు నుంచి అటే ఢిల్లీకి బయలుదేరి వెళతారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
మన్మోహన్ పార్ధీవ దేహానికి...
ఉదయం పది గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళతారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్ధీవ దేహానికి ముఖ్యమంత్రి నివాళులర్పిస్తారు. అనంతరం సాయంత్రం తిరిగి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరి రానున్నారు. మన్మోహన్ మృతికి సంతాపం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం నేడు ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

