Wed Feb 19 2025 15:41:39 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి... పార్టీ హైకమాండ్ తో?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం పది గంటలకు ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ఈరోజు పార్టీ హైకమాండ్ తో భేటీ కానున్నారు. రైతు రుణమాఫీ చేస్తున్న నేపథ్యంలో వరంగల్ లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఢిల్లీ పెద్దలను ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి హస్తిన బయలుదేరి వెళుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా కొందరు వెళుతున్నారు.
వరంగల్ లో సభ కోసం...
వరంగల్ లో లక్షలాది మంది తో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని రేవంత్ నిర్ణయించారు. రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేస్తుండటంతో రాహుల్ గాంధీని ఈ సభకు ఆహ్వానించాలని ఆయన భావిస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో వరంగల్ లోనే విడుదల చేసిన రైతు డిక్లరేషన్ లో రుణమాఫీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో అక్కడే భారీ బహిరంగసభ ను ఏర్పాటు చేసేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారు
Next Story