Tue Mar 24 2026 20:04:22 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

Revanth Reddy :తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై పార్టీ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. తెలంగాణలో ఎనిమిది స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
సీఈసీ సమావేశంలో...
తెలంగాణలో ఉన్న పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో పథ్నాలుగులో విజయం సాధించేలా రేవంత్ రెడ్డి శ్రమిస్తున్నారు. ఇందుకోసం ప్రచారానికి అగ్రనేతలను రాష్ట్రానికి రప్పించడమే కాకుండా, తనతో పాటు మంత్రులందరికీ నియోజకవర్గాల వారీగా బాధ్యతలను అప్పగించారు. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకునే లక్ష్యంగా పనిచేసేందుకు అవసరమైన సలహాలు, సూచనలు పార్టీ పెద్దల నుంచి తీసుకోనున్నారు.
Next Story

