Fri Dec 05 2025 13:29:54 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు రేవంత్ కీలక సమావేశం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. స్థానిక ఎన్నికలకు సంబంధించిన తేదీలతో పాటు బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా నేడు స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో స్థానిక సంస్థలను ఎప్పుడు నిర్వహించాలన్న క్లారిటీ రానుంది.
బీసీ రిజర్వేషన్లతో పాటు...
ఉన్నతాధికారులతోపాటు మంత్రులతో ఆయన ఈ కీలక భేటీ నిర్వహించనున్నారు. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే డెడికేడెట్ కమిషన్ నివేదికను సమర్పించిన నేపథ్యంలో దానిపై చర్చించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ కోటాను కూడా నేడు ఖరారు చేసే అవకాశముందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 17వ తేదోలోపు స్థానిక ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశముంది.
Next Story

