Tue Mar 17 2026 04:07:16 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : రాజకీయ పార్టీ నేతలతో రేవంత్ నేడు కీలక భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఆయన సమావేశం కానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రావాల్సిందిగా ఇప్పటికే అనేక రాజకీయ పార్టీల నేతలకు ఆహ్వనాలు వెళ్లాయి. రేవంత్ రెడ్డి వారితో నేరుగా సమావేశమవుతారు.
రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతాలపై ...
రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతాలపై ఆయన రాజకీయ పార్టీల నేతలతో చర్చించనున్నారు. తాము రూపొందించిన నమూనాలను వారి ముందు ఉంచి వారి అభిప్రాయాలను, సూచనలను రేవంత్ రెడ్డి తీసుకోనున్నారు. తాము ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందో రాజకీయ పార్టీల నేతలకు రేవంత్ రెడ్డి వివరించనున్నారు.
Next Story

