Thu Mar 19 2026 04:28:56 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు తిరుపతికి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుపతికి వెళ్లనున్నారు. ఉదయం పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుపతికి వెళ్లనున్నారు. సాయంత్రం బయలుదేరి ముఖ్యమంత్రి తిరుపతికి వెళతారు. ఈరోజు ఉదయం పరిశ్రమల భవన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. పరిశ్రమల భవన్ లో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన వంటి అంశాలపై అధికారులతో సమీక్షించనున్నారు.
పెట్టుబడులు పెట్టేందుకు...
తెలంగాణలో పెట్టుబడులకు పెట్టేందుకు వచ్చే పరిశ్రమలకు కల్పించాల్సిన రాయితీలపై కూడా నేడు ముఖ్యమంత్రి జరిపే సమీక్ష సమావేశంలో నిర్ణయించనున్నారు. ఎక్కువ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించేలా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఉపాధి కల్పనే ధ్యేయంగా హైదరాబాద్ నగరంలో మరిన్ని పరిశ్రమల స్థాపన కు ఆయన చేస్తున్న ప్రయత్నంలో భాగంగా నేడు సమీక్షించనున్నారు.
Next Story

