Thu Mar 19 2026 12:04:08 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : రేపు కొడంగల్ లో ఓటు వేయనున్న రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు కొడంగల్ కు వెళ్లనున్నారు. కొడంగల్ లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు కొడంగల్ కు వెళ్లనున్నారు. కొడంగల్ లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆయన రేపు మధ్యాహ్నం కొడంగల్ కు బయలుదేరి వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన తన ఓటు హక్కును కొడంగల్ లో వినియోగించుకోనున్నారు. సీఎం కొడంగల్ కు వస్తున్న సందర్భంగా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను చేశారు.
ఫుట్ బాల్ ఆడుతూ...
ఈరోజు గచ్చిబౌలి స్టేడియానికి రేవంత్ రెడ్డి వచ్చారు. ఫుట్ బాల్ టోర్నమెంట్ ను ప్రారంభించనున్నారు. కాసేపు విద్యార్థులతో కలసి ఆయన ఫుట్ బాల్ ఆడారు. విద్యార్థులతో కలసి ఆయన కాసేపు సరదాగా గడిపారు. రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడటానికి రావడంతో విద్యార్థులు కూడా ఆయనతో కలసి కాసేపు ఆట ఆడి ఉత్సాహంగా గడిపారు.
Next Story

