Thu Mar 19 2026 14:49:05 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు ఇంద్రవెల్లికి రేవంత్ రెడ్డి
ఇంద్రవెల్లికి నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

ఇంద్రవెల్లికి నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడి నుంచే పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సభ కావడంతో పార్టీ నేతలు పెద్దయెత్తున ఏర్పాట్లు చేశారు. భారీగా జనసమీకరణ చేయనున్నారు. ఇంద్రవెల్లి నుంచే పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని రేవంత్ రెడ్డి పూరించనున్నారు. ఈ సభ నుంచి మరో మూడు గ్యారంటీల అమలు దిశగా ఆయన ప్రకటన చేసే అవకాశముంది.
స్మారక స్మృతి వనానికి...
ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి కాకముందు కూడా పీసీసీ చీఫ గా తొలి సభను ఇంద్రవెల్లిలోనే రేవంత్ రెడ్డి నిర్వహించారు. అక్కడ కు చేరుకున్న తర్వాత ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్మృతి వనానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. బీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఇంద్రవెల్లి నుంచే గళం వినిపించనున్నారు. ఇందుకోసం భారీ వేదికను కూడా ఏర్పాటు చేశారు.
Next Story

