Mon Mar 23 2026 19:28:34 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై అధినాయకత్వంతో చర్చించనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై అధినాయకత్వంతో చర్చించనున్నారు. కేంద్ర ఎన్నికల కమిటీ నేడు సమావేశం కానుంది. ఈ సమావేశంలో పాల్గొని రానున్న లోక్సభ ఎన్నికల్లో మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిర్ణయించనున్నారు.
అభ్యర్థుల ఖరారుకు...
ఇప్పటి వరకూ కాంగ్రెస్ పదమూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. దీనిపై చర్చించేందుకు నేడు రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. ఈరోజు, రేపట్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది.
Next Story

