Tue Dec 16 2025 10:49:38 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : ఆదాయ మార్గాలపై నేడు రేవంత్ సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సచివాలయానికి రానున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సచివాలయానికి రానున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆయన సచివాలయానికి రావడం లేదు. పార్టీని గెలిపించే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మే 13న ఎన్నికలు పూర్తి కావడంతో ఇక పాలనపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. ఈరోజు మధ్యాహ్నం సచివాలయానికి రానున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు.
సచివాలయంలో...
ఆదాయాన్ని పెంచుకోగలిగితేనే ఇచ్చిన గ్యారంటీలను అమలు పర్చే వీలుండటంతో ఆయన ఈరోజు సచివాలయానికి వచ్చి ముఖ్యమైన అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు వివిధ శాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
Next Story

